Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.. ఆధునిక సమాజంలోనూ మనిషిని మనిషిగా చూడడంలేదంటూ ఈ ఘటనపై దళిత, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మానవాళికి అవమానం కలిగించే ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. అక్కడ మెట్లపై కూర్చొని ఉన్న మరో వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారిపోయింది.. సమాచారం ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లా నుండి ఈ విషయం నివేదించబడింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై మాట్లాడుతూ ‘సిధి జిల్లాకు సంబంధించిన వైరల్ వీడియో నా దృష్టికి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు..
Read Also: Husband Killed Wife: ‘ఫోన్’ పెట్టిన చిచ్చు.. భార్యని కాల్వలో తోసేసి హత్య చేసిన భర్త
కాగా, వైరల్ అయిన వీడియోలో, ఒక పేద వ్యక్తి మెట్లపై కూర్చొని ఉన్నాడు. అతని జుట్టు చిందరవందరగా ఉంది. చాలా రోజులుగా ఆకలితో ఉన్నట్టుంది అతని ముఖం. అయితే, నీలిరంగు జీన్స్ మరియు చెక్డ్ షర్ట్ ధరించిన ఒక వ్యక్తి అతడి ముందు నిలబడి, సిగరెట్ తాగుతూ.. అతడిపై మూత్ర విసర్జన చేస్తున్నాడు. మూత్ర విసర్జన చేసే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక, మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసే వ్యక్తి బీజేపీ యూత్ లీడర్ ప్రవేశ్ శుక్లాగా చెబుతున్నారు. కానీ, బీజేపీ నేతలు దీనిపై స్పందించడానికి నిరాకరించారు.. మరోవైపు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు సిద్ధి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై గిరిజన, దళిత, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.. తాగితే తాగు.. ఊగు.. కానీ, సాటి మనిషి అనే కనికరం లేకుండా.. ఇలా ప్రవర్తించడం ఏంటి? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీపై విపక్షాలు ఈ వీడియో షేర్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
क्या इसकी गिरफ़्तारी हो गई है ? pic.twitter.com/0N8OTnYDtD
— Gurpreet Garry Walia (@GarryWalia_) July 4, 2023