మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం , అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కనిపించే ఫ్రేమ్డ్ ప్లేట్లు లేదా ప్లాస్టిక్ బోర్డులలా కాకుండా, ఇక్కడ ఆదివాసీల జీవన విధానం , వారి సంస్కృతి ఉట్టిపడేలా అత్యంత ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ శిలాఫలకాలను ప్రారంభించారు. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల శైలిని ప్రతిబింబించేలా, రాయిని సహజంగా ఉంచి దానిపైనే…