Operation Karregutta : ములుగు జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న కర్రెగుట్ట ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. వాజేడు మండలం మొరుమూరు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు నుండి కర్రెగుట్టల వరకు రహదారి నిర్మాణ పనులకు గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ భూమిపూజ చేయడంతో, ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లైంది. మొరుమూరు గ్రామం నుంచి పామునూర్, జెల్లా, డోలి, తడపాల, చెలిమల గ్రామాల మీదుగా కర్రెగుట్టల…
Pawan Kalyan: గిరిజన ప్రాంతాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. పంచాయతీరాజ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం.. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశించారు. అడవితల్లి బాట పనులను వేగవంతం చేయాలన్నారు. సవాళ్ళు ఎదురైతే ప్రణాళికాబద్ధంగా అధిగమించాలి.. డోలీరహిత గిరిజన నివాసాలు ఉండాలన్నాదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు.
బీహార్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశా చేరుకున్నారు. భువనేశ్వర్‌లో చేపట్టిన రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. మోడీని దగ్గర నుంచి చూసిన ప్రజలు ఉత్సాహంతో ఉప్పొంగి పోయారు. మోడీ కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. అనంతరం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందన్నారు. ఈ వార్షికోత్సవం కేవలం ప్రభుత్వ వార్షికోత్సవం కాదని.. ఇది సుపరిపాలన స్థాపన వార్షికోత్సవం.. దీన్ని ప్రజాసేవ,…
భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు…
తాను దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రోడ్డు మార్గాన చేరుకున్నారు. మంత్రి సీతక్క, కిషోర్ ప్రినిపల్ సెకరెట్రి, కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా ఘన స్వాగతం పలికారు. ఆదివాసీలు వారి నృత్యాలతో ఆకట్టుకున్నారు. కుమురం భీమ్, బిర్శా ముండా విగ్రహాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ అభివృద్ధి నిమిత్తం రూ. కోటి 50 లక్షల విలువైన పనులు ప్రారంభించారు.
Ponguleti Srinivas Reddy : ప్రజాపాలనలో అప్లై చేసి కొని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లలో అప్లై చేసేకునే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలు చేర్చాము. సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసివేశామని, ఇప్పటి వరకు 2లక్షల 32 వేల దరఖాస్తులను యాప్ లో నమోదు చేశామన్నారు. ఆలస్యం అయిన అసలైన లబ్ధి దారులకు ఇల్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐటీడీఏ, ట్రైబల్ ఏరియాలో…
గత నలభై ఏళ్లుగా ఇల్లందు నియోజక వర్గంతో నాకు అనుబంధం ఉందని, ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాచలం పినపాక ఇల్లందు నియోజక వర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించా అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.