ఏపీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ శ్రేనులు ప్రజాగ్రహ సభ సక్సెస్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్న పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సంబరాల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ, సీపీఐ పార్టీల మీద నిప్పులు చెరిగారు. రాబోయే రోజుల్లో పార్టీ దూకుడు పెంచుతుందని, ఏపీలో శూన్యత ఉందని ఆయన అన్నారు. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని,…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లాలో వర్చువల్ విధానంలో పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ పథకం అమలు కానుంది. అమూల్ సంస్థ ద్వారా పాడి రైతులకు మెరుగైన లాభాలు వస్తాయని ఇప్పటికే జగన్ వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
ప్రస్తుతం జొమాటో, స్విగీ లాంటి ఎన్నో యాప్‌ల ద్వారా కిరాణం, రెస్టారెంట్‌ల వద్దకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే మనం వస్తువులను పొందుతున్నాము. అయితే తాజాగా పెట్రోల్ కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే తెచ్చిస్తామని చెబుతోంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) అంటోంది. అయితే బీపీసీఎల్ యాప్ ద్వారా పెట్రోల్, డిజీల్ బుక్ చేసుకుంటే హోం డెలివరీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మొదటగా విజయవాడలో ఈ పద్థతిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ కంటే ముందు వచ్చిన డెల్టా వేరియంట్‌తోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ సోకిన దేశాల్ల విజృంభిస్తోంది. ఇటీవల భారత్‌లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి భారతీయులపై విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులపై డబ్ల్యూహెచ్‌వో స్పందించింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్…
కరోనాతో ఇండియా మొత్తం ఒక్కసారిగా పాపులర్ అయిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఇటీవల నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్‌కు ఆయుర్వేద మందు అంటూ మీరు పంపిణీ చేసేందుకు ఎలాంటి అనుమతులు ఉన్నాయో చెప్పాలంటూ జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆనందయ్య నేను ఒమిక్రాన్ కోసం మందు అని చెప్పలేదని అన్నారు. అంతేకాకుండా తన మందు ఏ జబ్బుకైనా ఇమ్యూనిటిని మాత్రమే పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు.…
ఎన్ని కఠిన ఆంక్షలు విధించిన, చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని శిక్షలు పడుతున్నాకానీ కొందరు మారడం లేదు. వారి జల్సాల కోసం మరొకరి ప్రాణాలు తీస్తూ నిందితులుగా మారుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దంటూ ప్రభుత్వాలు, పోలీసులు చెబుతున్నా పెడచెవిన పెడుతూ ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నారు. అలాంటి ఘటనే ఘట్‌కేసర్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి నిఖిల్‌రెడ్డి మద్యం సేవించి అతి వేగంగా కారు నడుపుతూ ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్…
ఏపీ ప్రభుత్వం నిన్న ఇళ్ల పట్టాలతో సహా 16 సంక్షేమ పథకాల అర్హులై లబ్దిపొందని వారికి వారి ఖాతాలలో నగుదను జమ చేసింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాల లబ్ధిని పొందని 18.48 లక్షల మంది ఖాతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి రూ.703 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. అయితే నిన్న ప్రభుత్వం జమ చేసిన నగదు, ఇతర సంక్షేమ పథకాలు అందని అర్హులెవరైనా ఉంటే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం జగన్ వెల్లడించారు. అయితే…
సీఎం కేసీఆర్ నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. అయితే ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్ ఈ రోజు నల్గొండ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తరువాత సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుంచి…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌ను గజగజలాడిస్తోంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తూ ప్రజలపై విరుచుకుపడుతోంది. భారత్‌లో కొత్తగా 127 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య దేశంలో 781కు చేరుకుంది. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 23 రాష్ట్రాలకు విస్తరించింది. మహారాష్ట్రలో 167 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 238, కేరళలో 57, గుజరాత్లో 49, పుదుచ్చేరిలో కొత్తగా 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే…
ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు, సినిమా థియేటర్ల మూసివేత హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నేడు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు మంత్రి పేర్ని నానితో టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేతపై చర్చించి వారి ప్రతిపాదనలు అందించారు. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. సినిమా హాళ్లలో వసతులు మెరుగుపర్చాలని గతంలోనే చెప్పామని, సమయం ఇచ్చినా మార్పు లేకపోవడంతోనే తనిఖీలు చేశామన్నారు.…