ప్రస్తుతం జొమాటో, స్విగీ లాంటి ఎన్నో యాప్‌ల ద్వారా కిరాణం, రెస్టారెంట్‌ల వద్దకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే మనం వస్తువులను పొందుతున్నాము. అయితే తాజాగా పెట్రోల్ కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే తెచ్చిస్తామని చెబుతోంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) అంటోంది. అయితే బీపీసీఎల్ యాప్ ద్వారా పెట్రోల్, డిజీల్ బుక్ చేసుకుంటే హోం డెలివరీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మొదటగా విజయవాడలో ఈ పద్థతిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బీపీసీఎల్ సౌత్ డీజీఎం రాఘవేంద్రరావు తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫెసో క్యాన్‌తో ఇంధనాన్ని సరఫరా చేస్తామని, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బీపీసీఎల్ సౌత్ డీజీఎం రాఘవేంద్రరావు, ఏపీ, తెలంగాణ డీజీఎం భాస్కరరావులు మంగళవారం విజయవాడలోని గాంధీనగర్ పెట్రోల్ బంకువద్ద ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతేకాకుండా గాంధీనగర్ పెట్రలో బంక్‌లో సిబ్బందితో లేకుండా స్కాన్ చేసి సెల్ప్‌గా పెట్రోల్ నింపుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.