తూర్పుగోదావరి జిల్లా కడియంలో రెండు తలలతో గేదెదూడ జన్మించింది. అనంతరం 1 గంటలోపే మరణించిన సంఘటన మండలంలోని మురమండ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పాడిరైతు తూలూరి వీరకాసు మకాంలో నిన్న రాత్రి ముర్రా జాతి గేదెకు రెండు తలల లేగదూడ జన్మించింది. ఈ వార్త ఆ నోటా ఈ నోటా గ్రామమంతా వ్యాపించింది. గ్రామ ప్రజలు లేగదూడను చూసేందుకు ఎగబడ్డారు. ఇంతలోనే ఆ దూడ మరణించడంతో నిరుత్సాహపడ్డారు. జన్యులోపంతో బహు అరుదుగా ఇలాంటి లేగదూడలు జన్మిస్తాయని…
గత నెల క్రితం వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై, కాంచీపురం తిరువళ్లూరు, చింగ్లెపేట్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో చైన్నైలో ఫ్లడ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను సీఎం స్టాలిన్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై స్పందించిన మాజీ టీఎస్‌పీఎస్‌సీ మెంబర్, బీజేపీ నేత విఠల్ మాట్లాడుతూ.. మాజీ టీఎస్‌పీఎస్‌సీ మెంబర్ గా చెప్తున్న, 1 లక్ష 32 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాట అబద్ధం అని ఆయన అన్నారు. ఏడేళ్లలో టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేసింది 32 వేల ఉద్యోగాలేనని, కేసిఆర్ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నడని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు…
ఇటీవల తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసింది. అయితే ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే ఢిల్లీలో దాదాపు 4 రోజుల పాటు ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కలకలం రేగింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా…
ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే తెలంగాణలోకి కూడా ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ అనుకున్నదానికంటే శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన స్పష్టం…
ఫీవర్ హాస్పిటల్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్‌కి ఈ రోజు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు కాలేరు వెంకేటేశ్, ముఠా గోపాల్ సహా పలువరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 68 కోట్ల రూపాయలతో కవాడిగూడ బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసే వరకు నాలాకు రక్షణగోడ నిర్మాణం చేపడుతున్నామన్నారు. గతంలో కురిసిన వర్షాల వలన ప్రజలను బాగా ఇబ్బంది పడ్డారని, అప్పుడు…
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో మరోసారి దొంగలు రెచ్చిపోతున్నారు. నిజమాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. దర్పల్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో 10 మంది దొంగలు చొరబడ్డారు. పెట్రోల్ బంక్‌లోని కార్యాలయంపై రాళ్లతో దాడి చేస్తూ సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు. సిబ్బందిని బెదిరించి పెట్రోల్ బంక్‌లోని క్యాష్‌కౌంటర్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే క్యాష్ కౌంటర్‌లో సుమారు 40 వేలు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. దీంతో వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు…
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి అగ్రరాజ్యమైన అమెరికాతో తో పాటు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్‌తో సతమతవుతున్న వేళ ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఫ్రాన్స్‌లో కలవరం పుట్టిస్తుంది. యూకే, యూఎస్ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభన విపరీతంగా ఉంది. అంతేకాకుండా ఒమిక్రాన్ మరణాలు కూడా ఆ దేశాల్లో చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. ఫ్రాన్స్‌లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వీరంగం సృష్టిస్తోంది. రోజురోజుకు ఫ్రాన్స్…
11వ పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానుంది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. సీఎస్ సమీర్ శర్మకూడా ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలో పీఆర్సీపై ముచ్చటించారు. అయినప్పటికీ పీఆర్సీపై స్పష్టత నెలకొనలేదు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా…
ఏపీ సీఎం జగన్ ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కొనేవారు ఒక్కడే, అమ్మేవాళ్లు అనేక మంది ఉంటే.. కొనేవాళ్లు ఎంత చెప్తే.. అంతకు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుందని, ఇలాంటి మార్కెట్‌ను ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూస్తున్నామన్నారు. అందుకే…