BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 10 కొత్త నిబంధనలను జారీ చేసేందుకు సన్నద్ధమైంది. ఇది టీమిండియా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా అనుసరించాలి. వీటిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు కఠిన శిక్షలు కూడా విధించబోనుంది బీసీసీఐ. నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీఎల్ నిషేధం, జీతం కోత వంటి అంశాలు తీసుకురానున్నారు. నిజానికి ఇదంతా జట్టులో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం కోసమే అంటూ సమాచారం. ఇక బీసీసీఐ జారీ చేసిన మొత్తం 10 నియమాలు ఏమిటో ఒకసారి చూద్దాం. Also Read:…
ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ కారణంగా చాలా దేశాలు ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి. ఇజ్రాయిల్ ఏకంగా సరిహద్దులను మూసివేసింది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టులో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పని సరిగా చేయించుకోవాలి. పరీక్ష చేయించుకోని రిజల్ట్ వచ్చే వరకు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాలని ఆంక్షలు విధించారు.…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నది. దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది. దీంతో యూరప్ దేశాల్లో ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇజ్రాయిల్ దేశం సరిహద్దులు మూసివేసింది. జపాన్‌లో మొదటి కేసు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో కేంద్రం కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పని సరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ వచ్చేవరకు వారు ఎయిర్‌పోర్ట్‌లోనే…