ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ కారణంగా చాలా దేశాలు ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి. ఇజ్రాయిల్ ఏకంగా సరిహద్దులను మూసివేసింది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టులో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పని సరిగా చేయించుకోవాలి. పరీక్ష చేయించుకోని రిజల్ట్ వచ్చే వరకు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాలని ఆంక్షలు విధించారు. దీంతో ఎయిర్‌పోర్టులో సుమారు 8 నుంచి 9 గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Read: సీఎం జగన్‌తో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ
చెకింగ్, ఇమిగ్రేషన్ వంటివి పూర్తి కావడానికి సుమారు రెండు గంటలు పడుతుంది. క్యూలైన్లో నిలబడి పరీక్షలు చేయించుకోవడానికి అదనంగా మరో రెండు గంటల సమయం పడుతుంది. శాంపిల్స్ ఇచ్చిన తరువాత రిజల్ట్ రావడానికి మరో నాలుగు గంటల సమయం పడుతుంది. దీంతో రిస్క్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండి పోవాల్సి వస్తున్నది. అయితే, గంటల తరబడి విమానాశ్రయంలో ఉండటం కూడా ప్రమాదమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా వైరస్ సోకి ఉంటే వారి వలన మిగతా వారికి కూడా సోకే ప్రమాదం ఉండోచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.