హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కొత్త ఎమ్మెల్యేలకు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలకు క్రియాశీలక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. శుక్రవారం జరిగిన వీర మహిళల శిక్షణ తరగతుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందని.. బీజేపీ ఇద్దరు ఎంపీలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని గుర్తుచేశారు. ఇద్దరితో ప్రారంభమైన టీడీపీ ఇప్పుడు ఎవరి అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని శాసించగలిగే స్థాయికి వచ్చిందన్నారు. మహిళలు ముందుండి నడిపించకుంటే సమాజంలో మార్పు రాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.…
అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూలై 2న వీర మహిళలకు అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరించేందుకు పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన, పునశ్చరణ తరగతులను నిర్వహించబోతున్నట్లు వివరించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత, వీర మహిళలు చేసిన కృషి అనిర్వచనీయమని నాదెండ్ల మనోహర్…