Kamareddy : తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ భారీగా వరద నీరు నిలిచిపోయింది. రైల్వే ట్రాకులు మునిగిపోయాయి. దీంతో రెండు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు అధికారులు. మధ్యాహ్నం నిజమాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన రాయలసీమ రైలును, కాచిగూడ నుంచి మెదక్ వెళ్లే రైలును కూడా రద్దు చేశారు అధికారులు. Read Also : Floods :…
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై శుక్రవారం దేశం భగ్గుమంది. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్ధతిలో సైన్య నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ట్రాల్లో యువత ఆందోళనలు చేపట్టింది. ఇవి కొన్నిచోట్ల హింసాత్మకంగా మారాయి. ‘అగ్నిపథ్’ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్‌లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి.…