Kamareddy : తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ భారీగా వరద నీరు నిలిచిపోయింది. రైల్వే ట్రాకులు మునిగిపోయాయి. దీంతో రెండు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు అధికారులు. మధ్యాహ్నం నిజమాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన రాయలసీమ రైలును, కాచిగూడ నుంచి మెదక్ వెళ్లే రైలును కూడా రద్దు చేశారు అధికారులు.
Read Also : Floods : వరదల్లో చిక్కుకున్న 12 మంది.. సాయం కోసం ఎదురుచూపు..
కామారెడ్డిలో దాదాపు 10 కాలనీలు నీటిలో మునిగాయి. జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ కాలనీలో రైల్వే గేటు వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రైల్వే గేటు కాస్త మునిగిపోయింది. అటు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నిండా మునిగింది. ఇక్కడ కార్లు కూడా కొట్టుకుపోతున్నాయంటే వరద ఏ స్థాయిలో ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వాగులు, వంకల స్థాయిలో వరద నీరు పట్టణంలో ప్రవహిస్తోంది.
Read Also : Rahul Gandhi: చెల్లితో కలిసి రాహుల్‌గాంధీ బైక్ రైడింగ్