US Car Crash: ఐదు రోజుల క్రితం అమెరికా రోడ్డు ప్రమాదంలో అదృశ్యమైన భారత సంతతి కుటుంబానికి చెందిన నలుగురు మరణించినట్లు ఆదివారం మార్షల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. 80 ఏళ్ల వయసు ఉన్న సీనియర్ సిటిజన్ కూడా ఈ కారు ప్రమాదంలో మరణించారు.
ఛత్తీస్‌ఘడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లాలోని గోదర్‌మాన గ్రామంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాణసంచా పేలి ఐదుగురు చనిపోయారు.
Stampede in Mahakumbh : ఈరోజు మౌని అమావాస్య నాడు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో రాజ స్నానం జరుగుతుంది. ఇంతలో, సంగం నది ఒడ్డున ఓ బారీ కేడ్ విరిగిపోవడంతో ఉదయం తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది.
Stampede in Mahakumbh : మౌని అమావాస్య స్నానోత్సవం సందర్భంగా పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. సంగం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 17మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు.
Stampede in Mahakumbh : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య నాడు, సంగం వద్ద స్నానమాచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమిగూడారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
అన్నమయ్య జిల్లా గువ్వలచెరువు ఘాట్‌లో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 108 అంబులెన్స్ పైలట్ రమేష్ ఈరోజు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన 108 అంబులెన్స్ పైలట్ రమేష్ కుమార్ భార్య అనూషతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్‌లో మాట్లాడారు.
Noida : గ్రేటర్ నోయిడాలోని సూరజ్‌పూర్ శుక్రవారం సాయంత్రం కొత్వాలి ప్రాంతంలోని ఖోడ్నా కలాన్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు గోడ కూలిపోవడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఎటాహ్‌లోని కసా పూర్వి గ్రామం నుంచి గంగాస్నానానికి వెళ్తున్న గ్రామస్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై ఉన్న చెరువులో అదుపు తప్పి పడిపోయింది.