దేశంలో అన్ని పండగల కన్నా గణేష్ చతుర్థిని అందరూ చాలా ఇష్టంగా జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఎంతో హడావిడిగా ఉంటుంది. ఈ పండుగ వేళ కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుని.. కొన్ని కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుంది.
కడప జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వియన్‌పల్లి మండలంలోని మొగమూరు వాగులో వినాయక నిమజ్జనంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యువకుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.