Ganesh Immersion: గణేష్ నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు మృతి
- వినాయక నిమజ్జనంలో అపశృతి
- పలు ఘటనల్లో ముగ్గురు మృతి
- పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Immersion: దేశంలో అన్ని పండగల కన్నా గణేష్ చతుర్థిని అందరూ చాలా ఇష్టంగా జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఎంతో హడావిడిగా ఉంటుంది. ఈ పండుగ వేళ కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుని.. కొన్ని కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం పాపేపల్లి వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనానికి వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా.. 10 మంది తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Read Also: Rashmika Mandanna: రష్మిక’కి ప్రమాదం.. ఏమైందంటే?
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
కడప జిల్లా చక్రాయపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. నెరసుపల్లె క్రాస్ రోడ్డు వద్ద ట్రాక్టర్ కిందపడి ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆంజనేయపురం గ్రామానికి చెందిన గౌతం అనే యువకుడు మృతి మృతి చెందాడు. వినాయక నిమర్జనం అనంతరం ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. యువకుడి మృతితో అతడి కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరో ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. వాకాడు మండలం తూపులి పాలెంలో వినాయక నిమజ్జనంలో ఆపశృతి చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో వినాయకుని నిమజ్జనం చేస్తూ ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు నాయుడుపేటలోని కావమ్మ గుడి సెంటర్‌కు చెందిన మునిరాజా, ఫయాజ్, శ్రీనివాసులుగా స్థానికులు గుర్తించారు. శ్రీనివాసులును మెరైన్ పోలీసులు రక్షించారు. ఈ ఘటనలో ఫయాజ్ మృతి చెందగా.. గల్లంతైన మునిరాజా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!