తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా పరిగిలో మన ఊరు-మన పోరులో పాల్గొన్నారు. తెలంగాణలో 8 ఏళ్ళుగా పాలిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నామని చెప్పి కబంధ హస్తలలో బంధించారన్నారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కొండా రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మానిక్ రావ్, దేవేందర్ గౌడ్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. పరిగి ఎమ్మెల్యే దేవుడు మాన్యాలను మింగాడన్నారు. చేవెళ్లను కొండ పోచమ్మ లో ముంచిండు, చెల్లమ్మను…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఆది నుంచే సమస్యలకు నెలవైంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎంతో మంది రైతులు పేర్లు మారిపోవడం.. గుంట స్థలం ఉన్నవారికి ఎకరా స్థలంగా నమోదైతే.. ఇక ఎకరాల భూమి ఉన్న రైతు గుంట స్థలానికి యజమానికిగా చూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పడు అధికారులు ధరణి పోర్టల్‌ను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్…
విద్యుత్ పంపిణీ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలను చర్చకు తావు లేకుండా ఈఆర్సీ తిరస్కరించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడతూ.. రాష్ట్ర విభజన తర్వాత డిస్కామ్‌ల, ట్రాన్స్క్ లలో ఈఆర్సీ నిర్వహణలో లోపాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ పంపిణీ సంస్థల అప్పులు 11 వేల కోట్లు ఉంటే.. 8 వేల 9 వందల కోట్ల అప్పు భారం ను కేంద్రం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఉదయ్ స్కీమ్‌లో…
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ మేడారం జాతరకు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… సీఎం, పీఎం మేడారం జాతరను చిన్నగా చేసి చూపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ఆయన.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాలని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ ది భిన్నత్వంలో ఏకత్వం… ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం అంటూ ఎద్దేవా చేసిన ఆయన..…
అస్సాం సీఎం రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌లు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అస్సాం సీఎంపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, అస్సాం సీఎంపై కేసు నమోదు చేయాలని సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా నేడు సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు…
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతలు కాపాడడానికి ఉందా… ప్రతి పక్ష నేతల అరెస్ట్ లకోసమే పనిచేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. మహిళా నాయకురాళ్లను రాత్రి వరకు పోలీసు స్టేషన్ లలో ఉంచారని ఆయన విమర్శించారు. తెలంగాణా లో ఉన్నామా…నార్త్ కొరియా లో…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీపీసీసీకి అధ్యక్షుడిగా నిమామకమైన తరువాత మొదటి సారి మంగళవారం రేవంత్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామన్న వాతావరణం సృష్టించేందుకే కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను గందరగోళంలో పడేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ మోడీ కోవర్ట్…
ఇటీవల అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అస్సాం సీఎం వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అస్సాం సీఎం మాటలు దేశంలో ఉన్న తల్లులను అవమానించేలా మాట్లాడారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట…
పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. చట్టంలో లేకపోయినా, నమ్మకం కలిగించేలా ప్రధానులు వాఖ్యలు ఉండేవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని, మోడీ మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారని ఆయన అన్నారు. గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీ ది అని ఆయన ఆరోపించారు. ఒక్క ఓటు రెండు…
తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ కి రాజకీయ ప్రయోజనాల కంటే..రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు. కెసిఆర్ రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థ కి కేంద్రం ఆమోదం తో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది. జీఓ 317తో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీఓ ఉందన్నారు రేవంత్.…