తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు.
గత రెండు రోజులుగా తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జీవో 317లో సవరణల కోసం బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మరుసటి రోజు కోర్టులో హజరుపరిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు సికింద్రబాద్‌లో…
టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. చిల్లర ప్రయత్నాలతో కాంగ్రెస్ చరిత్రను రూపు మాపలేరని, దేశానికి మంచి రోజులు రావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన అన్నారు. అంతేకాకుండా సోనియా గాంధీ నాయకత్వంలోనే దేశానికి రక్షణ కలుగుతుందని ఆయన అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను భూస్థాపితం చేయాల్సిన బాధ్యత గాంధేయ వాదులపై ఉందన్నారు. పార్లమెంట్ లో…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది… మంత్రి మల్లారెడ్డి విసిరిన సవాల్‌కు స్పందిస్తూ.. మల్లారెడ్డికి కాదు.. సీఎం కేసీఆర్‌కే నా సవాల్.. అసెంబ్లీ రద్దు చేసి రావాలి ఎన్నికలకు వెళ్దామని ప్రకటించాడు రేవంత్‌రెడ్డి.. ఇక, అంతేకాదు.. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ.. కొన్ని పత్రాలను కూడా మీడియాకు చూపించారు.. అయితే, తాజాగా రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇస్తూనే.. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మల్లారెడ్డి.. తాను ఎంపీ…
మూడుచింతల వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేసిన రేవంత్… గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి.. తప్పుడు పత్రాలు చూపించి భూములు కబ్జా చేసినట్టు విమర్శించారు.. మల్లారెడ్డి సగం జోకర్, సడం బ్రోకర్ అని వ్యాఖ్యానించిన రేవంత్.. భూములు అమ్మినా..? కొన్నా..? మల్లారెడ్డికి మాములు ఇవ్వాలంట అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, జవహర్ నగర్‌లో తప్పుడు పత్రాలు సృష్టించి మల్లారెడ్డి…
తెలంగాణలో దళిత అధికారులకు ప్రాధాన్యత లేదని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రావిర్యాల దళిత దండోరా సభలో వ్యాఖ్యానించాడు. వర్షంలో తడుస్తూనే రేవంత్‌రెడ్డి తన ప్రసంగం కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ.. దళితులకు దళితబంధు అంటూ కేసీఆర్ మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారు. ఓట్ల అవసరమైతేనే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తాడని ఆరోపించారు. కేసీఆర్‌ను దెబ్బకొట్టే అవకాశం ప్రజలకు దక్కిందని.. ఇప్పుడే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నీకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు నీ మోచేతి…
నేడు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ సభలో ప్రారంభించారు. అయితే కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ధైర్యం కేసీఆర్ ఉందా? అని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 న కాంగ్రెస్ దళిత దండోరా సభ.. ఆ తర్వాత హుజురాబాద్ పై దండ ఎత్తుతాం.. కేసీఆర్ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.…
ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి కోటకు కేంద్రం తరపున నిధులను మంజూరు చేయాలని కోరారు. 45 నిముషాల పాటు ఈ సమావేశం సాగింది. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కిషన్ రెడ్డితో చర్చించాను. భువనగిరి కోట అభివృద్ధి, మూసినది ప్రక్షాళన, ఫార్మా సిటీ అంశాలను కిషన్ రెడ్డితో చర్చించానన్నారు.…