భారత బౌలర్ నవదీప్ సైనీ వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు తనను సెలెక్ట్ చేయడంపై షైనీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటికే కౌంటీ క్రికెట్ ఆడేందుకు నవదీప్ సైనీ ఇంగ్లండ్ చేరుకోగా.. అతను వోర్సెస్టర్‌షైర్ తరపున కౌంటీ ఆడనున్నాడు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమిపూజకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రానున్నారు. నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం, కొల్లూరులో డబుల్ బెడ్ రూం పనులకు సీఎం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, స్ధానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.
ఈనెల 22న(గురువారం) ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
పాకిస్థాన్ కు చెందిన వ్లాగర్ అబ్రార్ హసన్ తన బైక్‌లో ఇండియా మొత్తాన్ని చుట్టివచ్చాడు. తన టూర్ 30 రోజుల్లో 7,000 కి.మీ కలియతిరిగాడు. రెండు దేశాల మధ్య శత్రు సంబంధాలు ఉన్నప్పటికీ, ఇండియాలో తనను అపారమైన ఆప్యాయతతో స్వీకరించినట్లు హసన్ తెలిపాడు. తన బైక్ పై ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ముంబై, కేరళ మరియు మరిన్ని నగరాల్లో తిరిగినట్టు తెలిపాడు.
స్టిండీస్ లో భారత్ పర్యటన ఖరారైంది. జూలై నుంచి ఆగస్టులో మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12న డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జూలై 20 నుంచి రెండో టెస్టు జరగనుంది.
పాలంపేటలో ఉండే యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. అనంతరం రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆలయ విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నాడు. అంతేకాకుండా అక్కడి నుంచి రామప్ప చెరువుకు వెళ్లి బోటింగ్ చేశారు. అనంతరం చెరువులోకి వచ్చే గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్ పూజలు చేశారు. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులతో కాసేపు ముచ్చటించారు.
పెండింగ్ బిల్లులను ఆమోదించేలా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది.
నేడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12.45 నిలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకొనున్న కేసీఆర్.
సీఎం కేసీఆర్ శుక్రవారం (ఇవాళ) చేపట్టాల్సిన రాలేగావ్ సిద్ది (మహారాష్ట్ర) పర్యటన రద్దయినట్లు సమాచారం. ఇదివరకు సీఎంవో ప్రకటించినదాని ప్రకారం.. ముఖ్యమంత్రి మే 26న బెంగళూరు, 27న రాలేగావ్ సిద్ది పర్యటన చేపట్టాల్సి ఉంది. రాలేగావ్ సిద్దిలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ కావాల్సి ఉంది. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారని సీఎంవో గతంలో వెల్లడించింది. ఈమేరకు సీఎం 26న బెంగళూరుకు వెళ్లి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు తిరిగి…
ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆయన ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకి వెళ్లనున్నారు. 10 గంటలకు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్లనున్నారు. 11 గంటలకు హాల్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్నారు. 11.15 నిమిషాలకు లీలా ప్యాలస్ హోటల్కి చేరుకోనున్నారు. 11.45 హోటల్ నుంచి మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి బయల్దేరి వెళ్లనున్నారు. 12.30 మాజీ ప్రధాని దేవగౌడ ఇంటికి చేరుకోనున్నారు. దేశ రాజకీయాలపై, రాష్ట్రపతి అభ్యర్థిపై మాజీ…