CM KCR to Mahbubnagar today: నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుండి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12.45 నిలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకొనున్న కేసీఆర్. ముందుగా జిల్లా అధికారుల కాంప్లెక్స్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.15 నిలకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం చేయనున్న కేసీఆర్. మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదాన ప్రాంగణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు.
Read also: South Central Railway: హైదరాబాద్-విజయవాడ మధ్య ‘వందేభారత్’.. ఈనెలలోనే ప్రారంభం
కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులపై బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఏం చెబుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మోడీ, అమిత్ షాల విషయంలో కేసీఆర్ ఇప్పటికే మొండిగా ఉన్నారు. అంతకుముందు ఎన్నికల సమయంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఘాటుగా స్పందించారు. ఇక బహిరంగ సభలో వీరిని ఎంత తిట్టిపోస్తారనే ఆసక్తి నెలకొంది. మద్యం కుంభకోణంలో కేసీఆర్ ప్రమేయం ఉందని ఇటీవల తరుణ్ చుగ్ ఆరోపించారు. బలమైన ఆధారాలు ఉన్నందునే బీజేపీ అధిష్టానం ఆయనతో మాట్లాడిందని చర్చ జరుగుతోంది. తన కూతురు కవితకు సీబీఐ నోటీసులు, అదే కేసులో ఆయన ప్రమేయంపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని ప్రగతి భవన్ సన్నిహిత నేతలు చెబుతున్నారు. పాలమూరు బహిరంగ సభలో ఆగ్రహావేశాలన్నీ ప్రదర్శించే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది.
రేపు మహబూబ్ నగర్ కలెక్టరేట్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసిఆర్ #Mahabubnagar @TelanganaCMO pic.twitter.com/2YuvsqAASO
— Samrat (@teIangana) December 3, 2022