ఆసియా కప్-2023లో భాగంగా నేడు ( శనివారం ) పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న హైఓల్టేజీ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా.. పాక్ బౌలర్ల ధాటికి చతికిలపడింది. షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్ నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోవడంతో భారత జట్టు టాపార్డర్ 66 పరుగులకే కుప్పకూలింది.