కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పారుని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్ర లో కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీ లు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ లో…
హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. 6 హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల అక్రమ నిర్బంధాలపై బాధిత కుటుంబ సభ్యులు పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్బంధించిన ఆరుగురు ఎక్కడున్నారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. లోకేష్ అనే సోషల్ మీడియా ప్రతినిధి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణలో ఎస్సై జానకి రామయ్య కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ఎస్సై జానకి రామయ్య స్టేట్మెంట్ను…
యాదాద్రి కాదు యాదగిరిగుట్టే.. రికార్డులు మార్చండి యాదాద్రి పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై యాదాద్రి బదులు అన్ని రికార్డుల్లో యాదగిరి గుట్టగా మార్చాలని సీఎం ఆదేశం ఇచ్చారు. ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు…
“నటి కస్తూరిపై కేసు”.. 4 సెక్షన్లలో ఎఫ్ఐఆర్ నమోదు తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో కస్తూరి ఒకరు. రాజకీయాలు, సెలబ్రిటీలపై అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తూ ఉండే ఆమె తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో, క్షమాపణలు చెప్పాడు. ఈ స్థితిలో అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో వ్యవహరించడంతో పాటు నటి కస్తూరిపై చెన్నై ఎగ్మూర్ పోలీసులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని,…
కంసన్ హైజెన్ కేర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో అర్థరాత్రి ఒకసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో భారీ మంటలు ఎగిసిపడుతూ అందరూ చూస్తుండగానే క్షణాల్లో పూర్తిగా నేల మట్టం అయిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు.…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, లక్ష్యాలపై సమస్త అధికార యంత్రాంగానికి సీఎం దిశా నిర్ధేశం చేయనున్నారు. ఏపీ ఉప…
ఆరు గ్యారంటీల అమలుపై రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాతే రాష్ట్రంలో పర్యటించాలి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా వెజిటేబుల్ మార్కెట్ సౌచాలయాలకు భూమి పూజ సీసీ రోడ్లు నిర్మాణాన్ని ప్రారంభించారు. అలాగే, లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇక, బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ అగ్రనేత…
వెలిగొండ ప్రాజెక్ట్ను త్వరతగతిన పూర్తి చేస్తాం.. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశానికి ఆయనతో పాటు మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లాకు చెందిన టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ,…
రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారింది.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు.. రూ.2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులు బిచ్చగాళ్ళలాగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధ్యానం కొనుగోళ్ళు వెంటనే చేబట్టాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఎంతమందికి అయ్యింది? అని…