హైదరాబాద్ నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోడాం, నూతన సచివాలయం, రామాంతపూర్లో వరుస ఘటనలు మరువకముందే తాజాగా కూకట్ పల్లిలోని పార్క్ షేడ్స్లో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం భాగ్యనగర ప్రజలను భయాందోళనకు గురి చేసింది.