చికెన్ మేళాకు అనుహ్య స్పందన: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో అపోహలను తొలగించేందుకు రాజమండ్రిలో చికెన్ మేళాకు అనుహ్య స్పందన లభించింది. చికెన్ వంటకాలను తినడానికి నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. మేళాలో వివిధ రకాల చికెన్ వంటకాలను ఏర్పాటు చేశారు. చికెన్ వంటకాలను ఆరగించడానికి నాన్ వెజ్ ప్రియులు ఎగబడ్డారు. చికెన్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో ఈ చికెన్ మేళాను ఏర్పాటు చేశారు.…
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారని, సంక్షేమం పట్టించుకోవడం లేదని, అభివృధి ఎక్కడా కనిపించడం లేదని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకు మంచి చేశారు…