కాసేపట్లో పుట్టపర్తికి ప్రధాని మోడీ సత్య సాయి శత జయంతి వేడుకలకు పుట్టపర్తి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి కలకలలాడుతోంది. పుట్టపర్తిలో ఇంతటి జనసందోహం కనిపించడం బాబా నిర్యాణం తర్వాత ఇదే మొదటిసారి. ప్రపంచ వ్యాప్తంగా సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భగవంతుడిగా పూజలందుకునే సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారీ స్థాయిలో ఈ వేడుకలు నిర్వహించాలని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భావించింది. ఇందుకోసం నెల రోజుల…
వణికిస్తున్న ‘చలి పులి’.. 5 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది.. ముఖ్యంగా ఏజెన్సీలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీని వణికిస్తోంది చలి.. జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర చలి అలుముకుంది.. ఈ సీజన్లో తొలిసారిగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జి.మాడుగుల, మినుములూరు ప్రాంతాల్లో 5 డిగ్రీలు నమోదు కాగా, పాడేరు, అరకు, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…
కార్తీక మాసం చివరి సోమవారం ఎఫెక్ట్.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో.. ఓవైపు నదీ తీరాలు.. మరోవైపు శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలముకుంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. పలు స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఆర్థిక నేరస్తుడి అరెస్ట్.. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆర్ధిక నేరస్తుడు అనిల్ చోఖరాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబైలో అనిల్ చోఖరాను అరెస్ట్ చేసిన సిట్.. స్థానిక కోర్టులో హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ తీసుకువచ్చారు. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ డబ్బులో 77 కోట్ల…
అమరావతి అభివృద్ధికి అదనపు రుణాలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్.. రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి సర్కార్.. అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి అభివృద్ధి కోసం అదనపు రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రూ.1,500 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులను అమరావతి సిటీలో మౌలిక సదుపాయాల…
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రతిపాదనలపై ఫోకస్.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు.. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025–30కి ఆమోదం తెలపనుంది కేబినెట్.. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూకేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ…
కోనసీమలో వద్దు కాకినాడ ముద్దు.. నేడు బంద్కు జేఏసీ పిలుపు నేడు రామచంద్రాపురం బంద్కు పిలుపు ఇచ్చింది జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు.. మా ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు రామచంద్రాపురం బంద్కు పిలుపునిచ్చింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల డిమాండ్ను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు.. రామచంద్రాపురం డాక్టర్ బీఆర్…