Tomato Price in Madanapalle Today: వంటింట్లో నిత్యం వాడే ‘టమాటా’ ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. గత 40-45 రోజులుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని మార్కెట్‌లలో కిలో టమాటా రూ. 150 నుంచి 200 వరకూ పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే సామాన్య ప్రజలు జడుసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. టమాటా ధరలు పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ క్రమంలో మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
మదనపల్లె మార్కెట్ పరిధిలో బుధవారం (జులై 26) టమాటా ధర రికార్డు స్థాయికి చేరుకుంది. కిలో నాణ్యమైన టమాటా రూ. 168 పలికింది. రైతులు కేవలం 361 టన్నులు మాత్రమే మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఏ గ్రేడ్ కిలో టమాటా రూ. 118 నుంచి రూ. 138 వరకు.. బీ గ్రేడ్ కిలో టమాటా రూ. 140 నుంచి రూ. 168 వరకు.. సగటున కిలో టమాటా రూ. 132 నుంచి రూ. 156 వరకు పలికిందని మదనపల్లె మార్కెట్ యార్డు కార్యదర్శి అభిలాష్ చెప్పారు.
మంగళవారం రూ. 140 పలికిన కిలో టమాటా ధర.. నేడు రూ. 168కి చేరింది. ఒక రోజులోనే దాదాపుగా రూ. 30 పెరిగింది. దాంతో కొనుగోలు దారుల్లో గుబులు మొదలైంది. సామాన్య ప్రజలు అయితే టమాటా వైపు చూడ్డమే మానేశారు. దాంతో నిత్యం టమాటాలతో కళకళలాడే వంట గది.. వెలవలేబోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో.. టమాటా పంట దిగుబడి కూడా తగ్గింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది.
Also Read: Yuvraj Singh: యువరాజ్ సింగ్ కుటుంబానికి తప్పుడు బెదిరింపులు.. మహిళ అరెస్ట్!
Also Read: Bull Viral Video: వర్షాలకు తట్టుకోలేక.. బిల్డింగ్‌పైకి ఎక్కిన ఆంబోతు! వైరల్ వీడియో