Animal: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. వైలెన్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. గత ఐదు రోజులుగా ఈ సినిమా గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు.