ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరు ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. నాలుగేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ చిత్రం ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ ని స్పీడప్ చేశారు రాజమౌళి అండ్ కో. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని ముంబైలో ఖాళి లేకుండా కానిచ్చేస్తున్నారు. ఇంకోపక్క సోషల్ మీడియాలోను సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి హల్చల్ చేస్తున్నారు. ఇప్పటికే…
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. ఏపీలో సినిమా టికెట్స్ రేట్లు తగ్గించినందుకు టాలీవుడ్ హీరో నాని తన గొంతును విప్పి మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టికెట్స్ రేట్లను తగ్గించి ప్రేక్షకులను అవమానిస్తున్నారు. థియేటర్ల కలెక్షన్ల కన్నా కిరాణా షాపు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయని నాని అన్న మాటలకు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయమై స్పందించారు.…
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో భారీ హిట్ ని అందుకున్న అఖిల్ జోరు పెంచేశాడు. ఈ సినిమా తరువాత అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు కరోనా బ్రేకులు వేసింది. ఇటీవల డైరెక్టర్ సురేందర్ రెడ్డి కరోనా బారిన పడడంతో కొద్దిరోజులు షూటింగ్ ని వాయిదా వేశారు మేకర్స్. ఇక దీనివల్లనే రిలీజ్ డేట్ లో కూడా మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని…
టాక్సీవాలా చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రాహుల్ సాంకృత్యాన్.. ఈ సినిమా భారీ విజయాన్ని అదనుకోవడంతో నాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ నేడు విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. శ్యామ్ సింగరాయ్ .. ఒక సాధారణ బెంగాలీ యువకుడు.. ఒక…
అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన సినిమా ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’. నిజానికి రాజశేఖర్, జీవిత కుమార్తె శివానీ తెలుగు వారి ముందుకు ఈ మూవీతోనే రావాల్సింది. కానీ దీని విడుదల జాప్యం కావడంతో ‘అద్భుతం’ సినిమా ముందు రిలీజైంది. చిత్రం ఏమంటే ఆమె నటించిన తొలి రెండు సినిమాలూ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యాయి. ‘118’ మూవీతో తొలిసారి డైరెక్టర్ గా మారిన సినిమాటోగ్రాఫర్ కె. వి గుహన్ రూపొందించిన ‘డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.’ చిత్రం ఇప్పుడు సోనీ లివ్ లో…
‘పుష్ప’ వెనకే సౌతిండియాలోని నాలుగు భాషల్లో జనం ముందుకు వచ్చిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. హిందీలో ఈ మూవీని రీమేక్ చేయాలనే ఆలోచన ఉన్న నిర్మాత బోయనపల్లి వెంకట్ ఉత్తరాదిన దీన్ని రిలీజ్ చేయలేదు. కోల్ కత్తా నేపథ్యంలో, పునర్ జన్మ కథాంశంతో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’ ఎలా ఉందో తెలుసుకుందాం. వాసు (నాని) ఓ ఫిల్మ్ మేకర్. డైరెక్టర్ గా మారే ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. ఆ క్రమంలో సైకాలజీ స్టూడెంట్ కీర్తి…
నటరత్న నందమూరి తారక రామారావు నటజీవితం పరిశీలించిచూస్తే, ఉవ్వెత్తున ఎగసి, ఉస్సురుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. నింగిన తాకిన విజయాలే అధికం. అయితే 1971లో రంగుల సినిమాల ముందు రామారావు నలుపు-తెలుపు చిత్రాలు వెలవెల బోయాయి. ఆ సమయంలో అభిమానుల మది తల్లడిల్లిన మాట వాస్తవమే! అయితే ఎప్పటికప్పుడు తనను అభిమానించేవారిని తలెత్తుకొనేలా చేస్తూనే యన్టీఆర్ చలనచిత్ర జీవనయానం సాగింది. అదే తీరున పలు పరాజయాలు పలకరించిన వేళ, 1971లో అభిమానులకు మహదానందం పంచిన చిత్రంగా ‘శ్రీకృష్ణ…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. పాన్ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ చిత్రంగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరు పెంచిన మేకర్స్ నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో హీరో ప్రభాస్ మాట్లాడుతూ” ట్రైలర్ అందరికి నచ్చిందనుకుంటున్నాను. ఇది మాములు లవ్ స్టోరీ కాదు… పెదనాన్నగారి ఫోటో…
‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి చోటుచేసుకొంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ ఈవెంట్ కి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభాస్ ని చూడడానికి అభిమానులు కృష్ణంరాజు కటౌట్ పైకి ఎక్కడంతో ఆ కటౌట్ కిందపడిపోయింది. కటౌట్ కిందపడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వేలాదిమంది అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను ఆసుపత్రికి…
ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. జనవరి 14న విడుదలకానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాల డైరెక్టర్లందరూ స్టేజిపై సందడి చేశారు. ఇక ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం చేస్తున్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ” ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ ఈవెంట్ కి ఇంతమంది…