‘అంటే సుందరానికీ’ ఆవకాయ సీజన్ ఫిక్స్ చేశారన్నమాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్యామ్ సింగరాయ్ చిత్రంతో హిట్ అందుకున్న నాని జోష్ పెంచేశాడు. ఈ ఏడాది కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు చేసేశాడు. ప్రస్తుతం నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అలరించగా,.. తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెప్తూ జీరోత్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నానిని సుందర్ గా పరిచయం చేశారు.
ఇక పోస్టర్ లో నాని ఎర్రటి చొక్కా – పంచె కట్టులో బ్లాక్ టాన్ షూ వేసుకొని ఒక ట్రావెల్ లగేజీ బ్యాగ్ పై రిలాక్సింగ్ గా వాలిపోయి నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇక అనౌన్స్మెంట్ పోస్టర్ లో చూసినట్లుగా నాని పొడవైన పేరును రివీల్ చేశారు. ‘K.P.V.S.S.P.R సుందర ప్రసాద్’ అంటే “కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్” అని గోత్రనామాలతో సహా నాని చెప్పుకొచ్చాడు. నాని భాష, వేషధారణ బట్టి ఇందులో నాని బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక చివరలో ఈ సినిమా ఆవకాయ సీజన్ లో అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. అంటే సమ్మర్ లో సుందరానికీ చక్కలిగింతలు మొదలుకానున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫన్ రైడర్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నాని తన ఖాతాలో మరో హాట్ ని వేసుకుంటాడేమో చూడాలి.
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!