అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత పేరు మారుమ్రోగిపోతుంది. వరుస విజయాలను అందుకోవడంతో పాటు అరుదైన గౌరవాలు ఆమె చెంత చేరుతున్నాయి. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆహ్వానం అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సామ్.. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్ లో ముందంజలో ఉంది. ఇక వీటితో పాటు తాజాగా మరో మైలురాయిని అమ్మడు అందుకొంది. ఇండియన్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ ఏడాది అత్యత్బుత…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం శుక్రవారం మధ్యాహ్నం జరుగుబోతోంది. గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం, చిత్రసీమ మధ్య కనిపించని అగాథం ఏర్పడింది. సినిమా టిక్కెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధికంగా థియేటర్లలో అమ్ముతున్నారని, అలానే థియేటర్ల లైసెన్సులు రెన్యూల్ చేసుకోకుండా సినిమాలను ప్రదర్శిస్తున్నారని, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ నూ పొందకుండా సినిమా హాళ్ళు నడుపుతున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో…
ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ముంబై, చెన్నై, కేరళ.. ఇలా రోజుకో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ బృందం. ఇక తాజాగా కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ “ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ముఖ్య…
‘ఆర్ఆర్ఆర్’.. ప్రస్తుతం ఏ భాషలో విన్నా ఈ సినిమా గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రొమొతిఒన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ఈ భాషలో ఈవెంట్ పెడితే ఆ భాషలోని స్టార్ హీరోలను గెస్ట్ గా పిలుస్తూ అటెన్షన్ రాబడుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రాగా, తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ హీరోలు…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర లేదు. తనకు ఏది తప్పనిపిస్తే దాని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఎదుటివారు ఎంతటి వాడైనా సరే అస్సలు భయపడడు. సినిమాలు, రాజకీయ పార్టీలు ఈ ఒక్కతిని వదలకుండా ఏకిపారేసిన వర్మ ఎప్పుడు సీఎం జగన్ ని తప్పు పట్టింది లేదు. ఎందుకంట ఆయన ఎంతో కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి అని, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నిలబడి విజయాన్ని అందుకున్న మనిషి అని , అందుకే…
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం పరాజయాలను చవి చూస్తున్నాడు. ఇటీవల విడుదలైన మహా సముద్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శర్వా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని . డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు – ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి…
‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనిట్ సభ్యులకు సాయికిరణ్ స్క్రిప్ట్ అందించగా, శ్రీమతి శ్రుతిరెడ్డి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చంద్రాకాంత్ రెడ్డి, రోహిత్ కెమెరా స్విచ్చాన్…
నివేతా థామస్.. అందం, అభినయం కలగలిపిన హీరోయిన్. టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలను ఎంచుకొని వరుస విజయాలను అందుకొంటుంది. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గా వచ్చినా వకీల్ సాబ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన నివేతా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన తమ్ముడు నిఖిల్ తో ఫన్నీ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా నెట్టింట వైరల్ గా…
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన ఈ జంట అందులో సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా విగ్నేష్ దర్శకత్వంలో వసంత్ రవి నటించిన చిత్రం ‘రాకీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక…