అక్కినేని నాగచైతన్య- సమంత గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోయాక ఎవరి సినిమాలను వాళ్ళు చేసుకుంటూ బిజీగా మారిపోయారు. ఒకపక్క సమంత పాన్ ఇండియా మూవీస్ అంటూ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తోంది. మరోపక్క చైతూ సైతం హిట్ దర్శకులను లైన్లో పెట్టి షూటింగ్లు కూడా కానిచ్చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మాల్స్తి స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లా జోరును పెంచేశారు చిత్ర బృందం. ప్రమోషన్లలో భాగంగా ఇటీవల బంగార్రాజు మ్యూజికల్ నైట్ అనే ఈవెంట్ ని చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ కి నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా హాజరు అయ్యాడు. అయితే ఈ ఈవెంట్ లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
బంగార్రాజు చిత్రంలో రమ్య కృష్ణ, కృతి శెట్టితో పాటు మరో 8 మంది హీరోయిన్లు కనిపించనున్నారట. ఇప్పటికే ఫరియా అబ్దుల్లా ఒక ఐటెం సాంగ్ లో కనిపించగా .. మరో ఐటెం సాంగ్ లో జాంబీ రెడ్డి బ్యూటీ దక్ష నగార్కర్ కనిపించనుంది. ఇక ఈ ఈవెంట్ కి వారు కూడా హాజరు కాగా.. స్టేజిపై నాగ్ మాట్లాడుతుండగా వెనుక ఉన్న నాగ చైతన్య మెల్లగా తన పక్కనే నిల్చుని ఉన్న హీరోయిన్ దక్ష నగార్కర్ వైపు చూశాడు. చైతూ రొమాంటిక్ చూపుకు అంతే రొమాంటిక్ రెస్పాన్స్ ను దక్ష నగార్కర్ ఇస్తూ చిన్నగా కను బొమ్మలు ఎగరవేస్తూ చైతూ వైపు నవ్వుతూ చూసింది. ఇంకేముంది ఆ రియాక్షన్ కి చైతూ సిగ్గు మొగ్గలు తొడిగింది. మెలికలు తిరుగు నవ్వుతు ఇటువైపు తిరిగాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఏం చైతూ ఏం జరుగుతుంది.. దక్ష తో పులిహోర కలుపుతున్నావా అని కొందరు అంటుండగా.. మరికొందరు దక్ష.. అక్కినేని ఇంటికి కోడలిగా ట్రై చేస్తుంది అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు వాటిని కొట్టి పారేస్తూ ఏదో క్యాజువల్ గా జరిగి ఉంటుంది అంటూ సమర్థిస్తున్నారు. ఏదిఏమైనా చిన బంగార్రాజు ఇంతలా సిగ్గుపడి నవ్వడం అనేది కొంత అనుమానించదగ్గ విషయమే అని పలువురు నొక్కి వక్కాణిస్తున్నారు. మరి ఆ నవ్వుల వెనుక అర్ధం ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.