మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా మారాడు. ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు షూటింగ్స్ జరుపుకొంటున్నాయి. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ‘రావణాసుర‘ జనవరి 14న పూజా కార్యక్రమాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ లాయర్ గా విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం…
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్నారు. గణత్రంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు తొలుత భావించారు. అయితే సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు తప్పుకోవడంతో ‘ఉనికి’ మూవీని జనవరి 15న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మూవీ గురించి నిర్మాతలు బాబీ…
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు చలనచిత్ర జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన చేసిన సాహసాలు, అందుకు జనం మెచ్చి ఇచ్చిన విజయాలు ఆశ్చర్యం కలిగించక మానవు. ఓ వైపు హీరోగా విజయయాత్ర చేస్తూన్న యన్టీఆర్ 1960లో దర్శకత్వం చేపట్టాలని భావించారు. ‘సీతారామకళ్యాణం’లో రావణబ్రహ్మ పాత్రలో నటించి, దర్శకత్వం వహించి మెప్పించారు. ఆ సినిమాకు దర్శకునిగా తన పేరు ప్రకటించుకోలేదు. ఆ తరువాతి సంవత్సరం మరో ప్రయత్నంగా దర్శకత్వం వహిస్తూ, నటించి ‘గులేబకావళి కథ’ తెరకెక్కించారు. ఈ చిత్రానికి కూడా దర్శకునిగా…
ఆ రోజుల్లో డాన్స్ మాస్టర్ సలీమ్ పేరు తెరపై కనిపించగానే థియేటర్లలో ఈలలు మారుమోగి పోయేవి. తెలుగువాడు కాకపోయినా సలీమ్ తెలుగు చిత్రసీమలోని అగ్రశ్రేణి కథానాయకులందరికీ నృత్యరీతులు సమకూర్చి అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300 పైచిలుకు చిత్రాలకు సలీమ్ డాన్స్ కంపోజ్ చేశారు. మళయాళ సీమలో కన్ను తెరచిన సలీమ్ బాల్యం నుంచీ పచ్చని పొలాల మధ్య చిందులు వేస్తూ గడిపాడు. అతని డాన్సుల్లో ఈజ్ ను గమనించిన…
శతాధిక కథాచిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనులు తెలుగునాటనే అధికంగా ఉండడం విశేషం. వారిలో యాక్షన్ మూవీస్ తో అధికంగా మురిపించిన కె.ఎస్.ఆర్.దాస్ స్థానం ప్రత్యేకమైనది. చిత్రసీమలోని 24 శాఖలలో పట్టున్న దర్శకులు అరుదుగా కనిపిస్తారు. కె.ఎస్.ఆర్. దాస్ అన్ని శాఖల్లోనూ పట్టు సాధించాకే ‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’తో దర్శకుడయ్యారు. ఆపై ‘రాజయోగం’ చూడాలనుకున్నాడు ‘రాజసింహ’ తీశాడు. ‘గండరగండడు’ కాసింత కరుణించాడు. తరువాత ‘గందరగోళం’లో పడ్డాడు దాసు. ఆ సమయంలో కృష్ణ ద్విపాత్రాభినయంతో తెరకెక్కించిన ‘టక్కరి దొంగ –…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఒమిక్రాన్ కనుక ప్రజలపై విరుచుకు పడకపోయి ఉంటె ఈపాటికి ఈ సినిమా హడావిడి మాములుగా ఉండేది కాదు. జనవరి 7 న సినిమా రిలీ అయ్యి రికార్డులు సృష్టించేది. కానీ, కరోనా దెబ్బతో ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఏం.. ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త అయినా నెట్టింట వైరల్…
ఈ ఏడాది సంక్రాంతి చిన్న సినిమాలతో సందడి చేయనుంది. పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో భారీ రిలీఫ్ పొందిన చిన్న సినిమాలు ఇక తమ సినిమాలకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశాయి. ఇక తాజాగా ఈ సంక్రాంతి రేసులోకి యంగ్ హీరో విశాల్ కూడా ఎంటర్ అయ్యాడు. తు.ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన డింపుల్ హయతి నటిస్తోంది. ఇప్పటికే…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలోని మరోపాట జనం ముందు నిలచింది. మణిశర్మ బాణీలకు అనువుగా భాస్కరభట్ల పలికించిన పాటకు, ప్రేమ్ రక్షిత్ నృత్యభంగిమలు సమకూర్చారు. ఈ పాటలో చిరంజీవి, రెజీనా నటించగా, పలువురు డ్యాన్సర్స్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తారు. చిరంజీవి గతంలో తనదైన డాన్సులతో జనాన్ని కిర్రెక్కించారు. నిజానికి, ఆయనతో ఏ డాన్స్ చేయించినా, పాతగానే కనిపిస్తుంది. అది డాన్స్ మాస్టర్స్ కు నిజంగా ఓ సవాల్ అనే…
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్, నిశి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదల కానున్నట్లు…