సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్, నిశి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజగా కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
జనవరి 7 న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ కావడంతో ఈ సినిమా తెరమీదకు వచ్చింది. ఇక ఈ సంక్రాంతి రేసులో బంగార్రాజు, డీజే టిల్లు చిత్రాలతో పాటు హీరో కూడా జాయిన్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ కావడం వలన ఈ సినిమాలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రాలలో సంక్రాంతి విన్నర్ గా ఎవరు నిలబడతారో చూడాలి.
This Sankranthi 🎑
— Ashok Galla (@AshokGalla_) January 1, 2022
Get Ready for the Fire Cracker Entertainment in Theatres💥#HERO Releasing Grandly on
🌟JAN 15th 2022🌟#HEROFromJAN15th🤘@AgerwalNidhhi @SriramAdittya @GhibranOfficial #PadmavathiGalla @JayGalla @amararajaent @adityamusic#HappyNewYear2022✨ pic.twitter.com/xkdjOlBG7G