1. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,090లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,600లుగా ఉంది. 2. నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు నివాళులర్పించారు. అంతేకాకుండా లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు. 3. నేడు తాడేపల్లిగూడెంలో మూడో రోజు బస్సు యాత్ర జరుగనుంది. నారాయణపురం ఏలూరు బైపాస్,…
ధ్యానం మనసు ప్రశాంతతను, శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే ప్రతి రోజు ధ్యానం చేయడం ఎంతో అవసరం అంటున్నారు వైద్యులు. మతాలతో సంబంధం లేకుండా.. అన్ని మతాలలో ముఖ్యంగా బౌద్దమతంలో ధ్యానంకు ప్రాముఖ్యత ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నో చెడు అలవాట్లను సైతం ధ్యానం ద్వారా దూరం చేసుకోవచ్చు. మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు ప్రతి రోజూ ధ్యానం చేయడం తప్పనిసరి అని చెప్పవచ్చు. అంతేకాకుండా.. మానసిక ఒత్తిడి నుంచి బయటపడి ఎంతో ఆనందంగా జీవించడానికి…
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ అభిమానులకు నేడు పండగ రోజు. సన్నిహితులు ముద్దుగా తారక్ అని పిలుచుకునే ఈ నందమూరి స్టార్ 39వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. యంగ్ టైగర్‌ను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్ తరలివచ్చారు. దీంతో.. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయన ఇంటి దగ్గర హడావుడి చేశారు. ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది.…
వెండితెరపై వెలిగిపోవాలనే అభిలాష ఎంతోమందికి ఉంటుంది. అయితే, కొందరినే ఆ వెలిగే అదృష్టం వరిస్తుంది. తనదైన అభినయంతో నవ్వులు పూయిస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. తెలివితేటలు ఉంటే అందని ద్రాక్షను కూడా అందుకోవచ్చు అంటారు. అదే పంథాలో పయనించి, తనను తాను జనానికి పరిచయం చేసుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా సంపూర్ణేశ్ బాబు భలేగా ప్రచారం పొందాడు. ఆ పైనే హీరోగా జనం ముందు నిలిచాడు. సంపూర్ణేశ్ బాబును చూడగానే పక్కుమని నవ్వేవారు ఎందరో! ఆ…
ప్రేమకథా చిత్రాలకు తిరుగులేదు. అందుకు నాటి ‘పాతాళభైరవి’ మొదలు ఈ నాటికీ వస్తున్న ప్రేమకథా చిత్రాలే నిదర్శనం! ఆ ఉద్దేశంతోనే దర్శకుడు జయంత్ సి.పరాన్జీ తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రానికి ప్రేమకథనే ఎంచుకున్నారు. దానికి ‘ప్రేమించుకుందాం…రా!’ అన్న టైటిల్ నూ నిర్ణయించారు. వెంకటేశ్ హీరోగా డి.రామానాయుడు సమర్పణలో సురేశ్ బాబు నిర్మించిన ‘ప్రేమించుకుందాం…రా!’ చిత్రం 1997 మే 9న విడుదలై విజయఢంకా మోగించింది. ‘ప్రేమించుకుందాం…రా!’ కథలోకి తొంగి చూస్తే – రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ వీరభద్రయ్యకు, రెడ్డప్ప…
కార్మిక, కర్షక, శ్రామికుల దినోత్సవంగా మే 1వ తేదీ నిలచింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో మే డేని నిర్వహిస్తున్నారు. విప్లవ దినోత్సవంగానూ కొందరు మే డేను అభివర్ణిస్తారు. ఏది ఏమైనా ప్రపంచ కార్మిక దినోత్సవంగా మే 1వ తేదీ జేజేలు అందుకుంటోంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు కోసం 1837లో పోరాటం సాగింది. దాంతో అమెరికా అంతటా రోజుకు పది గంటలు పని గంటలుగా శాసనం చేశారు. ఆ స్ఫూర్తితోనే ఆ తరువాత 1862లో మన…
క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పర్వదినాల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. అయితే ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 15న అంటే నేడు క్రైస్తవులందరూ జరుపుకుంటున్నారు. గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద ఆయన మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక ప్రత్యేక రోజు. పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే ఆచరించబడుతుంది. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా…