Today (13-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించలేదు. గ్లోబల్ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు అందటంతో రెండు కీలక సూచీలు కూడా ఇవాళ సోమవారం ఉదయం ఫ్లాట్‌గానే ప్రారంభమై కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇండియా మరియు అమెరికాలో కీలకమైన ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు ముందుజాగ్రత్త పాటించారు.