Anam Ramanarayana Reddy: భవంతుని సేవకు భక్తులను దూరం చేసేందుకు ఓ రాజకీయ పార్టీ ప్రజలను అశాంతికి గురిచేసిందని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రశాంతంగా నిన్నటి రోజున లక్షల మంది పూజలు చేశారని తెలిపారు. తాజాగా నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రముఖ యాంకర్ శివజ్యోతి తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి అక్కడ క్యూ లైన్లో నిలబడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. శ్రీవారి ప్రసాదంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ సంఘాలు, నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్న సమయంలో, టీటీడీ సేవకులు…