తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతిరెడ్డి కిడ్నాప్‌కు గురైనట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారు. తన భర్త కిడ్నాప్‌కు గురయ్యాడని అతని భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుపతిరెడ్డి స్వస్థలం జనగాం జిల్లా దుబ్బకుంటపల్లి. అతను హైదరాబాద్‌లోని కుషాయిగూడలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. 5,929 గజాల స్థలం విషయంలో తన ప్రత్యర్థులతో తనకు వివాదం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుజాత పేర్కొంది.…