తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టేందుకు టీటీడీ సిద్ధం అయింది. ఇందులో భాగంగా మొదటి దశలో టీటీడీ అధికారుల కోసం 35 బ్యాటరీ కార్లను ప్రవేశ పెట్టింది. వీటిని ఈరోజు తిరుమలకు తీసుకొచ్చారు. బ్యాటరీ కారులోనే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చారు. ప్రస్తుతం అధికారుల కోసం 35 బ్యాటరీ కార్లు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రెండు, మూడు దశల్లో 100 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పర్యావరణాన్ని…
సంప్రదాయ భోజనం పై వెనక్కి తగ్గింది టీటీడీ. డబ్బులు తీసుకొని భోజనం పెట్టాలంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం పై విమర్శలు రావడంతో సంప్రదాయ భోజన పథకాని నిలిపివేస్తునట్లు ప్రకటించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. పాలకమండలి లేని సమయంలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ఏ కార్యక్రమం నిర్వహించిన స్వామి వారీ ప్రసాదంగానే పెట్టాలి… డబ్బులు వసూలు చెయ్యకూడదు అని తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సర్వదర్శనం ప్రారంభాన్ని వాయిదా వేశాం.. జిల్లా అధికారులు ఇచ్చే నివేదిక మేరకు…
తిరుమల పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడుతున్నారు టీటీడీ అధికారులు. ఇప్పటికే ఆర్టిసి ద్వారా కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఘట్ రోడ్డులో నడపాలని నిర్ణయించింది పాలకమండలి. ఆ కారణంగానే తాజాగా 35 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసింది టీటీడీ. దాంతో ఇక టీటీడీ పరిధిలోని అధికారులుకు ఇక పై ఎలక్ట్రిక్ వాహనాలు కేటాయించనున్నారు. ప్రస్తుతం వినియోగిస్తూన్న డిజిల్ వాహనాలను తిరుమల నుంచి అంచెలువారిగా తొలగించనుంది టీటీడీ. చూడాలి మరి ఈ వాహనాలను ఎప్పటి వరకు దారిలో…
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తిరిగి అన్ని రంగాలు ప్రారంభం అవుతున్నాయి. ఇక కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వేలాదిమంది కొండకు వస్తుంటారు. కరోనా సమయంలో తాత్కాలిక ఆటంకం ఏర్పడింది. అయితే, ఇప్పుడు భక్తులకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం మాత్రమే అందుబాటులో ఉన్నది. ఇక ఇదిలా ఉంటే, ఉదయం నుంచి రాత్రి వరకు తిరుపతి నుంచి తిరుమలకు వందలాది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తుంటాయి. డీజిల్ బస్సుల కారణంగా కొండల్లో కాలుష్యం పెరిగిపోతున్నది. దీంతో…
TTD పాలకమండలి సభ్యుల ఎంపిక ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందా? లెక్కకు మిక్కిలిగా సిఫారసులు, ఒత్తిళ్లతో ఎవర్ని ఎంపిక చేయాలో.. ఎవర్ని కాదనాలో తేల్చుకోలేకపోతుందా? మొహమాటానికి పోయి పోయినసారి సభ్యుల సంఖ్య పెంచిన ప్రభుత్వం మరోసారి అదే చేయడానికి వెనకాముందు ఆలోచిస్తోందా? పాలకమండలిలో చోటుకోసం కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల సీఎంల నుంచి వచ్చిన చాంతాడంత జాబితాను కుదించడం.. కాదనడం సర్కార్ వల్ల కావడం లేదట. 1933లో ఏడుగురు సభ్యులతో పాలకమండలి నియామకం! తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న…
తిరుమలలో ఆన్ లైన్ టిక్కెట్లు కేటాయింపులో గందరగోళం నెలకొంది. టీటీడీ కాల్ సెంటర్ కి భక్తుల ఫిర్యాదుల తాకిడి పెరుగుతుంది. సెప్టెంబర్ మాసంకు సంభందించిన 2 లక్షల 40 వేల… 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును నిన్న ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తామని ప్రకటించింది టీటీడీ. 9.30 గంటల వరకు సైట్ ఒపెన్ కాలేదంటు భక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు. 9.30 గంటలకే 90 శాతం టిక్కెట్లు విక్రయాలు పూర్తి…
ఇల వైకుంఠంలో ఆయన సామాన్య భక్తులకు ప్రాధాన్య ఇవ్వాలన్నారు. తమ అనుచరులకు బాగా దర్శనం జరిగితే చాలనుకుంటున్నారు వాళ్లు. దర్శనం విధానంలో మార్పులు తీసుకొస్తే తూట్లు పొడుస్తున్నారు కూడా. ఇంతకీ ఆయన తెచ్చిన మార్పులేంటి? అడ్డుపడుతున్నవారు ఎవరు? లెట్స్ వాచ్! అనుచరులకు ప్రొటోకాల్ దర్శనం కోరుకుంటున్న ప్రజాప్రతినిధులు! టీటీడీ పాలకమండలి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న ఎల్ 1,…
మంత్రి సత్యవతి రాథోడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ… క్రిష్ణా జలాలో తెలంగాణ వాటా గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళాం. కేంద్రం సకాలంలో స్పందించకపోవడంతో….ఈ అంశం కోర్టుకి వెళ్లింది. మిగులు జలాలను వినియోగించుకోవాలని ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చినా స్పందించలేదు అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగితే దేవుడితో అయిన పోరాటం చేస్తారు కేసిఆర్ అని చెప్పిన మంత్రి హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు తథ్యం అన్నారు. ఇక ఇదిలా ఉంటె ఈరోజు తిరుమల…
బ్రహ్మోత్సవాల కోసం పుష్కరిణి మరమ్మతు పనులును చేపట్టింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో పుష్కరిణి హరతిని నెల రోజులు పాటు రద్దు చేసింది. ఇప్పటికే పనులు ప్రారంభించింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే తిరిగి సెప్టెంబర్ 13నుంచే పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తెస్తారు.. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం మూలలో స్వామివారి పుష్కరిణి నెలకొని వుంటుంది. ముల్లోకాలలో వున్న అన్ని తీర్దాలు స్వామి పుష్కరిణిలో కలుస్తాయని ఆలయ పండితులు పేర్కొంటారు. దీంతో శ్రీవారి పుష్కరిణిని దర్శించుకున్నా.. అందులో స్నానం చేసిన సమస్త…
తిరుమలలో శిలువ గుర్తు కలకలం రేపుతోంది. ఇండికా కారుపై శిలువ గుర్తును గమనించకుండా… తిరుమలకు అనుమతిచ్చారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. తనిఖీ సమయంలో కారును క్షుణంగా తనిఖీ చేయలేదు విజిలెన్స్ సిబ్బంది. అయితే కారు వెనుక అద్దంలో ”శిలువ గుర్తు., ave Maria’’ అనే అన్యమత శ్లోకంతో తిరుమలకు వచ్చింది కారు. వారు తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించిన తిరుమల విజిలెన్స్ సిబ్బంది అనంతరం శిలువ గుర్తును తొలగించి కారును భక్తులకు అప్పగించారు విజిలెన్స్ అధికారులు. అయితే…