తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పరిపూర్ణానంద స్వామీజీ. కరోనా బారినుండి ప్రజలు కాపాడి,తిరుమలకు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలని స్వామిని వేడుకున్నానని చెప్పారు. తిరుమల కొండపై ఆహ్లాదకరమైన, అభివృద్ధిని పెంపొందిస్తూ టీటీడీ పటిష్టమైన నియమ నిబంధనలు కొనసాగించాలన్నారు.
టీటీడీ మరిన్ని ధార్మిక కార్యక్రమాలను మంచి ఉత్సాహంతో ముందుకు కొనసాగించాలని స్వామిని కోరుకున్నానని పరిపూర్ణానంద స్వామీ చెప్పారు.గతంలో నిర్లక్ష్యానికి గురైన వకుళా మాత ఆలయాన్ని చాలా అద్భుతంగా పునరుద్ధరణ చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక బాధ్యతతో అమ్మవారి ఆలయ పునర్ నిర్మాణాన్ని చేపట్టారని ప్రశంసించారు. త్వరలోనే వకుళా మాత అమ్మవారి ఆలయం ఆవిష్కరణ జరుగుతుందన్నారు శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద.