ఇప్పటికే పలు సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్ విక్రయించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇవాళ జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనుంది.. ఈ రోజు ఆన్లైన్లో జనవరి నెల కోటాకు సంబంధించిన దర్శన టికెట్లతో పాటు పలు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి తిరుమల పోటీసులు జారీ చేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఇటీవల తిరుమల కొండపై రీల్స్ చేసిన వివాదంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు.
తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్‌కు ఫిర్యాదు చేశాడు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను బెంగళూరుకు చెందిన సాయి కుమార్‌కు అధిక ధరకు విక్రయించిన ఓ ప్రజాప్రతినిధి. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బ్లాక్‌లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్నట్లు ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. తిరుమలలో శ్రీవారి దర్శనానికి.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ఇప్పటికే ఈ ఏడాది ఆర్జిత సేవా టికెట్ల కోటా పూర్తి కాగా.. ఆన్లైన్లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది.
ఈ రోజు జనవరి నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్లైన్లో విడుదల చేయనున్న టీటీడీ.. మరోవైపు.. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి (ఈ నెల 21వ తేదీ) ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది.. ఇక, ఎల్లుండి (21వ తేదీ) మధ్యాహ్నం లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది టీటీడీ.
వాయుగుండం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో.. టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అంతేకాకుండా.. పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు కూడా మూసివేయనున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో ఆదేశించారు.
ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్లో జనవరి నెలకు సంభందించిన దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. మీరు తిరుమల వెళ్లాలని అనుకుంటే మాత్రం ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టికెట్లు అలా వచ్చి ఇలా అయిపోతాయి. అంత ఫాస్ట్‌గా బుక్ చేసుకుంటారు. 19వ తేదీ నుంచి 21వ తేదీ ఉదయం వరకు లక్కీ డిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల…
Tirumala Landslides: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈవో శ్యామల రావు అధికారులతో సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. 15 లక్షల మంది భక్తులు వాహన సేవలను విక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు.