పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల.. తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇక, పలీనా అంజని మైనర్ కావడంతో.. ఆమె తండ్రిగా పవన్ కల్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల లడ్డూ వివాదం కారణంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నియమ నిష్ఠలతో స్వామి వారి నామం స్మరిస్తూ భక్తి మార్గంలో నడుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బెజవాడ కనకదుర్గ అమ్మవారి గుడి మెట్లు శుభ్రం చేసి స్వయంగా మెట్ల పూజ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ప్రాయశ్చిత్త దీక్ష విరమణలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి మెట్ల మార్గం…
ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించింది సిట్.. ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్కు సిట్ పరిమితంకానుంది.. అయితే, గత మూడు రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు.. ఇక, తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. 3వ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించారు..
తిరుపతి లడ్డు వివాదాన్ని అర్థం చేసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ హైకోర్టులో సీబీఐతో విచారణ జరపాలని కేసు వేశానన్నారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
తిరుపతి బాలాజీ ఆలయ దర్శనానికి హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో కొండల మధ్య ఉంది. కలియుగంలో వేంకటేశ్వరుడు తన భక్తులను సమస్యల నుండి రక్షించడానికి అవతరించినట్లు భక్తులు విశ్వసిస్తారు. మీరు కూడా తిరుపతి బాలాజీని సందర్శించాలనుకుంటే తిరుమల దర్శన్ ప్యాకేజీని బుక్ చేసుకోవడం ద్వారా మీరు ఒకేసారి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. కాబట్టి వివరాలు తెలుసుకుందాం.
ఇక, 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ చేరుకోనున్నారు. రాత్రి తిరుమలకు చేరుకుంటారు అని ఆయన చెప్పారు. రెండవ తేదీన తిరుమలలోని ప్రధాన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పరిశీలిస్తారు.. అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో పవన్ పాల్గొంటారు అని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వెల్లడించారు.
Tirumala: తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో పులి సంచారంతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన మొదలైంది. కాగా, తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు రాత్రివేళ చిరుత రావడంతో కుక్కలు దాని వెంట పడ్డాయి.