TTD Tickets: తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం.. పోలీసుల అదుపులో ముగ్గురు!
- తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం
- వెలుగులోకి రూ.300 ప్రత్యేక దర్శన నకిలీ టికెట్లు
- పోలీసుల అదుపులో ముగ్గురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం తిరుమలలో మరోసారి కలకలం రేపింది. నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్న కొందరిని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తు్న్నట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు ఇంటి దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్ ఉద్యోగి లక్ష్మీపతి.. అగ్నిమాపక శాఖ సిబ్బంది మణికంఠ, భానుప్రకాశ్‌లు ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా నకిలీ టికెట్ల దందా నిర్వహిస్తున్నారు. ట్యాక్సీ డ్రైవర్లు శశి, జగదీశ్‌తో కుమ్మకై.. స్వామివారి ఆదాయాన్ని అందినకాడికి దోచుకున్నారు. మణికంఠ సాయంతో లక్ష్మీపతి నకిలీ టికెట్లు తయారు చేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు గుర్తించారు. లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు నకిలీ టికెట్లతో భక్తులను దర్శనానికి పంపుతున్నట్లు తేల్చారు.
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
- Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను నిలిపివేశారు. భక్తుల వద్ద నుంచి నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ సిబ్బంది ముగ్గురు కలిసి హైదరాబాద్, పొద్దుటూరు, బెంగళూర్ నుంచి వచ్చిన 11 మంది భక్తులకు టికెట్లు అమ్మి రూ.19 వేలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇంటి దొంగలతో పాటు ట్యాక్సీ డ్రైవర్లును అదుపులోకి తీసుకున్నారు. వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు టీటీడీ అధికారులు సిద్ధమయ్యారు.
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!