ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. దివ్య మంగళ స్వరూపుడై.. రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా?. కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది. రేపటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు..
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడవాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఐదవరోజైన ఇవాళ సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు స్వామివారికి అత్యంత ప్రియమైన గరుడసేవ జరగనుంది. గరుడ వాహనంపై మలయప్ప దర్శనం సర్వ పాపహరణం గరుడ సేవ రోజున లక్ష్మీకాసుల హారం, సహస్రనామ మాల, పచ్చలహారాన్ని ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు.
Tirumala Brahmotsavam: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రైవేట్ వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. రేపు (అక్టోబర్ 4వ తేదీ) నుంచి ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం వరకు ప్రైవేట్ వాహనాలను పీఏసీ 3 వరకు మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు.
తిరుమలలో శ్రీ శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 23వ తేదీ వరకు జరుగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలకు నిన్న (శనివారం) సాయంత్రం శాస్త్రోక్తంగా టీటీడీ అర్చకులు అంకురార్పణ చేపట్టారు.
అక్టోబర్ 5వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. అక్టోబర్ 6వ తేదిన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్ఫణ… అక్టోబర్ 7 నుండి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే అక్టోబర్ 7వ తేదిన సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య ధ్వజారోహణంతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు… 7వ తేది రాత్రి 8.30 నుండి 9.30 గంటల మధ్య పెద్దశేష వాహనం మీద దర్శనమివ్వనున్నారు. ఇక 8వ తేది ఉదయం…