ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కొత్త హిస్టరీ క్రియేట్ చెయ్యడానికి యష్ రాజ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఇటివలే పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన మేకర్స్, ఈసారి వరల్డ్ బాక్సాఫీస్ నే టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నారు. షారుఖ్ నటించిన పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో క్యామియో ప్లే చేయిస్తేనే వెయ్యి కోట్లు వచ్చాయి… ఇక ఇద్దరినీ కలిపి ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది…
వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ ఫేస్ ఆఫ్ అంటే DCU లవర్స్ ‘బాట్ మాన్ Vs సూపర్ మాన్’ అంటారు, MCU లవర్స్ ‘కెప్టెన్ అమెరిక Vs ఐరన్ మాన్’ అంటారు. బాట్ మాన్ , సూపర్ మాన్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మాన్… అందరూ సూపర్ హీరోలే, అందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి. వాళ్ల వాళ్ల యూనివర్స్ ల్లో ఆల్మోస్ట్ ఈక్వల్ రోల్స్ ప్లే చేశారు ఈ సూపర్ హీరోస్. విలన్స్ ని తుక్కుతుక్కుగా కొట్టే,…