రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో ప్రసిద్ధ ఆడపులి "ఆరోహెడ్" మరణించింది. ఆరోహెడ్ వయసు దాదాపు 11 సంవత్సరాలు. ఇది ఫిబ్రవరి 2014లో జన్మించిందని అధికారులు తెలిపారు. ఆరోహెడ్, రణథంబోర్ పార్క్‌లోని ప్రసిద్ధ ఆడపులి 'మచ్లి' కుటుంబానికి చెందినది. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆరోహెడ్ బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించింది.