పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీకి సైకిల్‌పై బయల్దేరారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ రామానాయుడు సైకిల్ యాత్ర ప్రారంభించారు. నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్ర పాలకొల్లు నుంచి అమరావతి సాగనుంది. ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పాలకొల్లులో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రోజారమణి హారతిచ్చి ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రకు ఎదురు…
టిడ్కో ద్వారా కేటాయించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అమలు చేయాలని కోరుతూ విజయవాడలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కన్వీనర్ బాబురావు, కార్యకర్తలు.. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 90 శాతం పూర్తైన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క విజయవాడ నగరంలోనే 15 వేలకు పైగా గృహాలు నిర్మించి…