గోదావరి నదిలో విహారం ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. అందులోనూ పాపికొండల అందాలకు ముగ్ధులవ్వని పర్యాటకులు వుండరు. చాలాకాలంగా పాపికొండలకు వెళ్ళాలనుకునేవారికి నిరాశే కలిగింది. అయితే పరిస్థితులు మారడంతో ప్రభుత్వం పాపికొండల టూర్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి పాపికొండల సందర్శనకు పర్యాటకులకు అనుమతి మంజూరు చేసింది. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభం అవుతున్నాయి టూరిజం బోట్లు. రాజమండ్రి నుంచి వర్చువల్ గా పాపికొండల బోట్లను ప్రారంభించనున్నారు టూరిజం మంత్రి అవంతి శ్రీనివాసరావు. పాపికొండల…