కొందరు వ్యక్తులు తెలిసీ తెలియక చేస్తున్న పనులు హీరో సిద్ధార్థ్ కు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. చిత్రం ఏమంటే ఆ విషయాన్ని స్వయంగా సిద్ధార్థే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నాడు. ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానెల్ కు సంబంధించిన థంబ్ నెయిల్ సిద్ధార్థ్ ను షాక్ కు గురిచేసింది. ‘యుక్తవయసులో చనిపోయిన 10 మంది దక్షిణాది ప్రముఖ తారలు’ అంటూ ఓ వీడియోను ఒక యూ ట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. దాని థంబ్ నెయిల్ లో సౌందర్య,…