పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక పోస్టు చేశారు. తనకు దేశం విడిచి వెళ్లే అవకాశం వచ్చినా తాను అంగీకరించలేదని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో తెలిపారు.
ఒలింపిక్ క్రీడల సమయంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చర్యలు తీసుకుంది. మూడేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
భారత్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు రూ. 10319 కోట్ల మొత్తాన్ని వారు కొట్టేశారు. ఈ విషయాన్ని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతోంది. గత 5 ఏళ్లుగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత మూడేళ్లల్లో అయితే కంగా 18 లక్షల మంది అదనంగా పన్ను చెల్లింపుదారులుగా మారారు.