‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి చోటుచేసుకొంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ ఈవెంట్ కి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభాస్ ని చూడడానికి అభిమానులు కృష్ణంరాజు కటౌట్ పైకి ఎక్కడంతో ఆ కటౌట్ కిందపడిపోయింది. కటౌట్ కిందపడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వేలాదిమంది అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను ఆసుపత్రికి…