దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జల దిగ్బందంలో ఉన్నాయి.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. తెలంగాణాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మరో మూడు రోజులు భారీ వర్షాలు కూరవనున్నాయని అధికారులు వెల్లడించారు… కొమురంభీం జిల్లాలోని కాగజ్‌నగర్ పెద్దవాగులో నీటి ప్రవాహం పెరిగింది. కాగజ్‌గనర్ మండలం అందవెల్లి బ్రిడ్జి తాత్కాలిక రోడ్డు నీట మునిగింది. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.. కాగజ్‌నగర్-దహెగాం రవాణ వ్యవస్థ పూర్తిగా బ్రేక్ పడినట్లయింది. కాగజ్‌నగర్…
ఆంధ్రప్రదేశ్‌లో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు.
నైరుతి ఋతుపవనాలు ఈ రోజు తమిళనాడు, కర్ణాటక అంతటా మరియు మహారాష్ట్రలో మరికొంత భాగం, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో మరి కొంత భాగం మరియు అన్ని ఈశాన్య భారత దేశ రాష్ట్రాలలోకి ప్రవేశించినవి. ఋతుపవనాలు తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రలలో మెదక్, నల్గొండ, రెంటచింతల వరకు ఈ రోజు ప్రవేశించినవి. ఈ రోజు ఉపరితల ద్రోణి నైరుతి మధ్య ప్రదేశ్ నుండి మరత్ వాడ, తెలంగాణ, రాయలసీమ మీదగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9…
నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కర్ణాటక తీరం, గోవా అంతటా మరియు మహారాష్ట్రలో కొంత భాగం, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో చాలా భాగం, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో కొంత భాగం (నైరుతి జిల్లాలలోకి) తమిళనాడులో చాలా భాగంలోకి ప్రవేశించాయి. రాగల 24 గంటలలో తెలంగాణా రాష్ట్రంలో చాలా భాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు నైరుతి దిశగా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నాయి. రాగల 3 రోజులు (05,06,07వ తేదీలు) తేలికపాటి…
నిన్నటి తుఫాను యాస్ తీవ్రమై నిన్న రాత్రి తీవ్ర తుఫాను ‘YAAS'(యాస్)గా మారింది. ఈ రోజు ఉదయం 08:30 నిమిషాలకు పశ్చిమ & పరిసరాల్లోనే ఉన్న తూర్పుమధ్య & ఉత్తర బంగళాఖాతంలో కొనసాగుతూ, పరదిప్ కి దక్షిణ ఆగ్నేయ దిశగా 280 కిమి దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదిలి, మరింత తీవ్రతతో బలపడి రాగల 12గంటలలో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తరవాయువ్య దిశగా కదులుతూ, మరింత…
నైరుతి రుతుపవనాలు నిన్న (22.05.2021) నైరుతి బంగాళాఖాతము ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం మరియు అండమాన్ నికోబార్ దీవులు యొక్క అన్ని ప్రాంతాలలో విస్తరించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు (22.05.2021) అల్పపీడనం కొనసాగుతుంది, మరియు దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు ఉన్నట్లు…
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటలలో నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఎల్లుండి (22వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని… ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముందని పేర్కొంది. ఇది…