అగ్ర రాజ్యం అమెరికాలో ఎవరైనా రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా పని చేసే అవకాశం ఉంటుంది. మూడోసారి చేసే అవకాశం ఉండదు. రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం.. ఏ వ్యక్తి కూడా రెండుసార్లు కంటే ఎక్కువ అధ్యక్ష పదవికి ఎన్నిక కాకూడదు. కానీ తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.